Chess: భారత స్టార్ ప్రజ్ఞానందకు మరో డ్రా.. 1 y ago
ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్రజ్ఞానందకు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం గురెల్ ఎడిజ్ (తుర్కియె)తో రెండో రౌండ్ ను అతడు 46 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం అదిరే విజయాన్ని అందుకున్నాడు. విన్సెంట్ కీమర్ (జర్మనీ)పై అతడు 45 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఏడు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో.. అరవింద్ 1.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానంద, అనీష్ గిరి తదితరులు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉన్నారు.